వందేభారత్ రైళ్లు పేల్చేస్తామని బెదిరింపులు
వందేభారత్ రైళ్లు పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు
వందేభారత్ రైళ్లు పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ మేరకు ఆగంతకుడి లేఖ కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని నలుగురు జిహాదీల బృందం ప్లాన్ చేసినట్టు లేఖలో ఆగంతకుడు పేర్కన్నారు. వందేభారత్ రైళ్లలో బాంబులు పెట్టేందుకు ప్లాన్ చేశారని ఆ లేఖలో ఆగంతకుడు తెలియజేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
రైల్వే జీఎంకు లేఖ రాసి...
ఈనెల 3న రైల్వే జీఎంకు పోస్టులో వచ్చిన లేఖను వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లేఖతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. వందేభారత్ రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఇది ఆకతాయిల పనా? లేక కావాలని ఎవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి లేఖను పోస్ట్ చేశారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది.