యజమానిని పెంపుడు కుక్క చంపిందా? లేక మరైదైనా?
హైదరాబాద్ లో పెంపుడు కుక్క యజమానిని గాయపర్చడంతో అతను మరణించాడు
హైదరాబాద్ లో పెంపుడు కుక్క యజమానిని గాయపర్చడంతో అతను మరణించాడు. హైదరాబాద్ - మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్కతో కలిసి ముప్ఫయి ఏడేళ్ల పవన్ కుమార్ నిద్రిస్తున్నాడు. అయితే నిద్రలో ఉండగా పవన్ కుమార్ ను కొరికి ఆ కుక్క చంపిందని స్థానికులు అనుమానిస్తున్నారు.
నోటి నిండా రక్తం...
ఉదయం అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా పవన్ కుమార్ డోర్ ఓపెన్ చేయకపోవడంతో అనుమానంవచ్చి చుట్టుపక్కల వారితో కలిసితలుపులు పగలగొట్టగా రక్తపు మడుగులో చనిపోయి పవన్ కుమార్ కనిపించాడు. అయితే పవన్ కుమార్ పై గాయాలుండటంతో పాటు కుక్క నోటి నిండా రక్తం ఉండటంతో కుక్క చంపిందని స్థానికులు అనుమానించారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.