భూకంపం వచ్చిందనుకున్నారు

నానక్ రామ్ గూడ లో సిలిండర్ బ్లాస్ట్ వ్యవహారంలో ప్రజలు ఇప్పటికీ భయపడిపోతున్నారు.

Update: 2021-11-23 09:27 GMT

భూకంపం వచ్చింది అనుకున్నారు.. పెద్దఎత్తున పేలుడు జరిగింది.. భవనం కంపించిపోయింది ..భయానికి చుట్టుపక్కల వాళ్ళు పరుగులు తీశారు.. క్షణాల్లో అంతా జరిగిపోయింది. అయితే జరిగిందో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు. నానక్ రామ్ గూడ లో సిలిండర్ బ్లాస్ట్ వ్యవహారంలో ప్రజలు ఇప్పటికీ భయపడిపోతున్నారు. మూడంతస్తుల భవనం లో గ్యాస్ లీక్ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం మొత్తం కంపించిపోయింది. పెద్దఎత్తున శబ్దం వినిపించింది. ఈ పేలుడు ధాటికి తొమ్మిది మంది కి తీవ్ర గాయాలు కాగా, మరొక 11 మంది గాయాల పాలయ్యారు.

పేలుడు ధాటికి...
వీరందరు కూడా ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . మూడు అంతస్తుల భవనాన్ని వలస కూలీల కు అద్దెకు ఇచ్చారు . ఇవాళ వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పెలి. పేలుడు ధాటికి భవనంలో ఉన్న గదులు అన్ని మొత్తం కూడా కుప్పకూలిపోయాయి. చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీరందరిని రక్షించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు . పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News