భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది.. జరిగిపోయిందంతే!!

అదే ప్రాంతానికి చెందిన వరతో సుహితకు పరిచయమైంది. వారిద్దరూ దగ్గరవ్వడంపై ప్రసాద్

Update: 2024-02-27 10:57 GMT

నెల్లూరులో సంచలనం రేపిన ఓ వ్యక్తి హత్యకేసు వెనుక.. పాత కక్షలు, వివాదాలు ఉన్నాయని అందరూ నమ్మేశారు. కానీ జరిగింది తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ హత్య చేయించింది ఆ వ్యక్తి భార్య. భార్య చంపేయాలని అనుకుంది.. జరిగిపోయింది. భార్య కళ్లెదుటే భర్తను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా చంపారని అనుకున్నారు.. అయ్యో పాపం అతడి భార్య అని అనుకున్నారు. తీరా చూస్తే ఆ పాపం చేయించిందే భార్య అని విచారణలో తెలిసిపోయింది.

నెల్లూరు నవాబుపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో జనవరి 18న ఓ వ్యక్తి దారుణ హత్య జరిగింది. రామచంద్రాపురం రామాలయం వీధికి చెందిన పెంచలప్రసాద్‌కు ముగ్గురు అక్కలు. పెద్ద అక్క కుమార్తె సుహితతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ప్రసాద్‌ లగేజ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 18న ప్రసాద్ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. ప్రసాద్‌, సుహితకు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భర్త స్నేహితుడు, అదే ప్రాంతానికి చెందిన వరతో సుహితకు పరిచయమైంది. వారిద్దరూ దగ్గరవ్వడంపై ప్రసాద్.. స్నేహితుడు వర, భార్యను మందలించాడు. వారిద్దరూ కలిసి పెంచల ప్రసాద్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. ఈ నెల 18న ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య చేయించాలని అనుకుంది సుహిత. ప్రసాద్‌ నిద్రపోయిన తర్వాత తలుపుకు గడియ పెట్టకుండా బయటకు వచ్చింది. వర కు సమాచారం ఇచ్చింది సుహిత. అతడు తన స్నేహితులైన సాగర్‌, వెంకటసాయి, మనోహర్‌, వేలు లివింగ్‌ స్టన్‌, నాగేంద్ర బాబు, పెంచలయ్య, నిరీక్షణ్‌లతో ఇంట్లోకి వెళ్లాడు. నిద్రిస్తున్న పెంచల ప్రసాద్‌ను అతికిరాతకంగా హత్య చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు తన నోట్లో దుస్తులు కుక్కి తన భర్తను హత్య చేసి పరారయ్యారని సుహిత పోలీసులకు చెప్పింది.
దర్యాప్తులో ప్రసాద్ రెండో అక్క లక్ష్మి, అదే రోజు రాత్రి ఊరి నుంచి వస్తుండగా ప్రసాద్‌ ఇంట్లో నుంచి వరతో పాటు మరికొందరు బయటకు పరుగెత్తుకుంటూ వచ్చారని పోలీసులకు చెప్పడంతో అసలు విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు ఆరా తీస్తే ఈ నెల 25న రాత్రి ఎస్‌వీజీఎస్‌ కళాశాల మైదానం దగ్గర వర, సాగర్‌, వెంకటసాయి, మనోహర్‌, లివింగ్‌ స్టన్‌, నాగేంద్ర బాబును అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసింది తామేనని అంగీకరించడంతో పోలీసులు వాళ్ళను అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, మొబైల్స్, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News