నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆత్మకూరు మండలం వద్ద

Update: 2025-06-05 05:09 GMT

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఒక ఆటో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

వెంకటరావుపల్లి నుండి ముస్తాపురం గ్రామానికి పొగాకు గ్రేడింగ్ పనుల కోసం వ్యవసాయ కూలీలు ఆటోలో వెళుతుండగా, ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్న సమయంలో కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News