ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 'సూఫీ బాబా' కాల్చివేత

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 'సూఫీ బాబా'ను నాసిక్‌లో కాల్చివేత

Update: 2022-07-06 08:23 GMT

మహారాష్ట్రలోని నాసిక్‌లో 'సూఫీ బాబా'గా ప్రసిద్ధి చెందిన ముస్లిం ఆధ్యాత్మిక గురువుని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. 35 ఏళ్ల వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవాడు. మంగళవారం నాసిక్‌లోని యోలా పట్టణంలో కాల్చి చంపబడ్డాడు. హత్య వెనుక గల కారణాలను పోలీసులు తెలుసుకుంటూ ఉన్నారు. ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలోని యోలా పట్టణంలోని MIDC ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడిని ఖ్వాజా సయ్యద్ చిస్తీగా గుర్తించినట్లు అధికారి తెలిపారు.

దుండగులు అతని నుదుటిపై కాల్చడంతో అతను అక్కడికక్కడే మరణించాడని అధికారి తెలిపారు. సూఫీ బాబాను హతమార్చిన అనంతరం దుండగులు అతడు ఉపయోగించిన ఎస్‌యూవీని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. యోలా పోలీస్ స్టేషన్‌లో హత్యానేరం నమోదైంది. హంతకులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఆయన డ్రైవరే ఆయను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సూఫీ బాబాగా ఛిస్తీకి స్థానికంగా పేరుంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ఈయన నాశిక్ లో ఉంటున్నారు. ఈ హత్యకు మతపరమైన కారణాలు ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒక స్థలానికి సంబంధించి ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. స్థానిక ప్రజల సహకారంతో ఛిస్తీ కొంత భూమిని తీసుకున్నారని.. ఆఫ్ఘనిస్థాన్ పౌరుడు కావడంతో మన దేశంలో ఆయన భూమిని కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో స్థానికుల సహకారంతో భూమిని సేకరించారని చెప్పారు. ఈ భూ వ్యవహారమే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు.


Tags:    

Similar News