Mumbai : ముంబయిలో చిన్నారుల కిడ్నాపర్ హతం
ముంబయి లో చిన్నారులను కిడ్నాప్ చేసిన రోహిత్ ఆర్య మరణించాడు. పోలీసు కాల్పుల్లో రోహిత్ ఆర్య మృతి చెందాడు
ముంబయి లో చిన్నారులను కిడ్నాప్ చేసిన రోహిత్ ఆర్య మరణించాడు. పోలీసు కాల్పుల్లో రోహిత్ ఆర్య మృతి చెందాడు. ముంబై పొవై ప్రాంతంలోని ఓ స్టూడియోలో 19 మంది చిన్నారులను బందీలుగా ఉంచిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వారిలో 17 మంది టీనేజ్ పిల్లలే ఉన్నారని అధికారులు తెలిపారు. గంటపాటు కొనసాగిన ఈ ఘటనకు ముగింపు పలుకుతూ పోలీసులు అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బాత్ రూమ్ ద్వారా స్టూడియోలకి ప్రవేశించి రోహిత్ ఆర్యను లొంగిపోవాలని కోరారు.
కాల్పులు జరపడంతో...
అయినా వినకపోవడంతో పోలీసులు రోహిత్ ఆర్యపై కాల్పులు జరిపారు. తర్వాత ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఈ ఘటనకు కారణమని గుర్తించారు. అతను పిల్లలను వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ పేరుతో పిలిచి స్టూడియోలోకి తీసుకెళ్లి బందీలుగా ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సుమారు గంటలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పిల్లలు అందరూ సురక్షితంగా ఉన్నారని, వారిని తల్లిదండ్రుల వద్దకు అప్పగించామని లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.