మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు సుంకర ప్రసాద్‌ నాయుడు

Update: 2022-07-24 08:41 GMT

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడును అరెస్ట్‌ చేశారు పోలీసులు. గుంతకల్లుకు చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసులో సుంకర ప్రసాద్ నాయుడుని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. నిందితుడి నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప‍్రసాద్‌ నాయుడితో పాటు మరో 15మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు పోలీసులు. వారికి చెందిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు సుంకర ప్రసాద్‌ నాయుడు గ్యాంగ్‌పై కేసులు ఉన్నాయి. ఇటీవలే ఆకుల వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాప్‌ చేసి రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారు ప్రసాద్‌ గ్యాంగ్‌.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు సుంకర ప్రసాద్‌ నాయుడు గ్యాంగ్‌పై కేసులు ఉన్నాయన్నారు. గుంతకల్లుకు చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాప్‌ చేసిన ఘటనకు సంబంధించి సుంకర ప్రసాద్‌ నాయుడుని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రసాద్‌ నాయుడితో పాటు మరో 15మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వారికి చెందిన రెండు వాహనాలను సీజ్‌ చేశామన్నారు.
ప్రసాద్‌ సొంతూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఏకంగా 33 హత్య కేసుల్లో నిందితుడు. తాను చేసిన హత్యల గురించి వివరించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇతని భార్య ఓ మాజీ నక్సలైట్‌. ప్రసాద్‌కు సుమారు రెండు దశాబ్దాల క్రిమినల్‌ చరిత్ర ఉంది.
అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలతో డోన్ సమీపంలోని ఓబుళాపురంపై మిట్టపై కిడ్నాపర్ల ముఠాను అరెస్టుచేసి బాధితునికి విముక్తి కల్పించారు పోలీసులు. ఈ ఘటనతో పాటు గత నెల 29 న స్వామీజీ ముత్యాల గంగరాజును కిడ్నాప్ చేసి రూ. 24 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేశారు. వీరి నుండీ ఒక ఫిస్టోల్, 16 తుటాలు, స్కార్పియో, ఎటియాస్, బుల్లెట్ వాహనాలతో పాటు రూ. 6.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News