Breaking : బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం.. చాలా మందికి పాజిటివ్

బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మందికి నార్కోటిక్ పరిక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు తేలింది

Update: 2024-05-23 07:30 GMT

బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మందికి నార్కోటిక్ పరిక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు తేలింది. డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అన్న దానిపై రక్తనమూనాలను పోలీసులు సేకరించారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది నుంచి రక్తనమూనాలను పోలీసులు సేకరించి వారిని పంపించి వేశారు. అందులో డ్రగ్స్ ను విక్రయించిన కొందరిని మాత్రం పట్టుకున్నారు. 59 మంది పురుషలు, 27 మందికి పాజిటివ్ వచ్చినట్లు నార్కోటిక్ పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు తెలిసింది.

తెలుగు వారందరికీ...
అందులో తెలుగు రాష్ట్రానికిచెందిన వారు కూడా ఉన్నారు. అయితే పాజిటివ్ వచ్చిన వారందరికీ నోటీసులు ఇచ్చి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అందులో పాల్గొన్న వారందరికీ నోటీసులు ఇవ్వాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం అయితే ఉంది. పోలీసులు దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.


Tags:    

Similar News