సహాయం చేస్తామని నమ్మించి.. హాకీ గ్రౌండ్ లో సామూహిక అత్యాచారం

దాంతో రూమ్ కోసమని ఓ గెస్ట్ హౌస్ కు వెళ్లగా.. ఆ గెస్ట్ హౌస్ కేర్ టేకర్ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో ఇద్దరు..

Update: 2023-07-17 11:42 GMT

jodhpur minor girl gang rape

సహాయం చేస్తామని నమ్మించి 17 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు కాలేజీ విద్యార్థులు.. ఆమె స్నేహితుడి కళ్లముందే సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరిగింది. ఆదివారం (జులై 16) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. పోలీసుల నుంచి వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఇద్దరికి కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం బాధితురాలు తన స్నేహితుడితో కలిసి బస్సులో అజ్మీర్ నుంచి జోధ్ పూర్ బయల్దేరింది. ఇద్దరూ జోధ్ పూర్ చేరుకునేసరికి రాత్రి 10.30 గంటలైంది.

దాంతో రూమ్ కోసమని ఓ గెస్ట్ హౌస్ కు వెళ్లగా.. ఆ గెస్ట్ హౌస్ కేర్ టేకర్ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో ఇద్దరు అక్కడి నుంచి బయటికి వచ్చి.. పౌటా చౌరహాకు వెళ్లారు. వీరికి సమందర్ సింగ్ భాటీ, ధర్మపాల్ సింగ్, భట్టమ్ సింగ్ అనే ముగ్గురు కాలేజీ విద్యార్థులు తారసపడ్డారు. వారి పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుని.. సహాయం చేస్తామని నమ్మించారు. ఆహారం, కూల్ డ్రింక్స్ అందిస్తామని, దుహాన్ లోని రైల్వే స్టేషన్ కు తీసుకెళ్తామని తెలిపారు. వారి మాటలు నమ్మి ఇద్దరూ.. ముగ్గురు విద్యార్థులతో కలిసి వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీ ఓల్డ్ క్యాంపస్ లో ఉన్న హాకీ గ్రౌండ్ కు తీసుకెళ్లారు.
బాధితురాలి స్నేహితుడిని చితకబాది.. అతడి ముందే బాధితురాలిపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. తెల్లవారుతుండటంతో.. వాకింగ్ వచ్చేవారి సంఖ్య పెరుగుతుండటాన్ని గమనించి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నిస్సహాయ స్థితిలో ఉన్న యువతి, యువకుడిని గమనించిన వాకర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి స్టేట్ మెంట్ ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తప్పించుకునే క్రమంలో నిందితుల్లో ఇద్దరి కాళ్లు విరిగిపోయాయని, మరొకరికి గాయాలయ్యాయని దుహాన్ డీసీపీ పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.


Tags:    

Similar News