మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత దారుణ హత్య

మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ దారుణ హత్యకు గురయ్యారు.

Update: 2025-07-15 04:39 GMT

మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ దారుణ హత్యకు గురయ్యారు. కొల్పారం మండలం వరిగుంతం గ్రామ శివారులో ఈ హత్య జరిగింది. తొలుత రోడ్డు ప్రమాదం గా భావించిన పోలసీులు అక్కడ బుల్లెట్లు లభ్యం కావడంతో హత్యగా భావించి ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.

బుల్లెట్లు దొరకడంతో...
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటన స్థలం నుంచి కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకన్న పోలీసులు అనిల్ మృతదేహంపై గాయాలు కూడా ఉండటంతో హత్యగా ప్రాధమికంగా నిర్ధారించారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో పాల్గొని ఇంటికి వెళుతున్న అనిల్ పై కొందరు ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. అనిల్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News