Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. శనినివారం పణంబూరు జంక్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది. రోడ్డును ఒక ఆవు దాటుతుండగా, మూల్కీ నుంచి మంగళూరు వైపు వచ్చిన గ్యాస్ ట్యాంకర్ ఆగింది. దాని వెనుక వచ్చిన ఆటో కూడా నిలిచింది. తర్వాత ఇన్నోవా కారు కూడా ఆగింది. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన మరో ట్యాంకర్ ఇన్నోవా వాహనంపైపై పెద్ద వేగంతో దూసుకొచ్చింది.
ట్యాంకర్లను ఢీకొట్టడంతో...
బలంగా ఢీకొట్టడంతో ఇన్నోవా ఎడమ వైపు తుక్కు తుక్కయిపోయింది. ఆటో మాత్రం రెండు ట్యాంకర్ల మధ్య ఇరుక్కొని పూర్తిగా నలిగిపోయింది. ఘటన స్థలంలోనే ఆటో డ్రైవర్‌తో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మృతులను మహమ్మద్ కున్చి, అబూబకర్ , ఇబ్రహీం ప్రయాణికులుగా గుర్తించారు. ఇన్నోవాలో ఉన్న ఒక వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు.