Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో్ భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో్ భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై వెళుతున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారితో సహా ఏడుగురు మరణంచారు. రాంగ్ రూట్ లో వచ్చి మరీ టిప్పర్ కారును ఢీకొట్టింది.
కారు -టిప్పర్ ఢీకొట్టడంతో...
టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో మృతదేహాలు మాత్రం నుజ్జునుజ్జయ్యాయి. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళుతున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వెంటనే అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరణించింది ఎవరన్నది ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.