ఊహించని ప్రమాదంలో 15 మంది మృతి

మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాహాపూర్ సమీపంలో సమృద్ధి

Update: 2023-08-01 02:04 GMT

మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాహాపూర్ సమీపంలో సమృద్ధి హైవేపై మంగళవారం తెల్లవారుజామున క్రేన్ కూలిపోయిన ఘటనలో 15 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.ఈ ఘటన జరిగినప్పుడు హైవేపై వంతెన నిర్మాణం కోసం క్రేన్‌ను ఉపయోగిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్‌కు చెందిన రెండు బృందాలు ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికి తీయగలిగాయి. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో ఏకంగా 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. థానే జిల్లా షాపూర్‌లో సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన గిర్డర్ యంత్రం ఒక్కసారిగా కార్మికులపై పడింది. పిల్లర్లతో అనుసంధానించే ఈ యంత్రం వంద అడుగుల ఎత్తు నుంచి పడినట్టు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరో ఆరుగురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News