పెళ్లి చేసుకోవాలని కోరిన యువతి.. అతడు అంత దారుణం చేస్తున్నా వీడియో తీసిన మరో వ్యక్తి

Update: 2022-12-25 01:51 GMT

తనను పెళ్లి చేసుకోవాలని కోరిన మహిళను అత్యంత దారుణంగా కొట్టాడు ఓ యువకుడు. మరో వ్యక్తి వీడియోను రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఓ మహిళను ఆమె ప్రియుడు కిరాతకంగా దాడి చేశాడని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో 24 ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

ప్రియురాలు పెళ్లి చేసుకోమని అడిగినందుకు కోపంతో ఓ వ్యక్తి ఆమెను తీవ్రంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు మహిళ తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడిని అడిగింది. ఆ వ్యక్తి మొదట్లో చిరాకు పడతాడు.. తర్వాత ఆమె ముఖంపై పదే పదే తన్నడం, దారుణంగా కొట్టడం జరుగుతుంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని.. వీడియో రికార్డు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, వీడియోలోని వ్యక్తి మౌగంజ్ ప్రాంతంలోని ధేరా గ్రామ నివాసి అని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) నవీన్ దూబే తెలిపారు. బాధితురాలికి, నిందితులకు సంబంధం ఉందని, వారి మధ్య వివాదం మొదలైన తర్వాత అతను ఆమెను కొట్టాడని అతను చెప్పాడు.ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పటికీ అతడిపై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది. నిందితుడిని ఐపిసి సెక్షన్ 151 (ప్రజా శాంతికి విఘాతం కలిగించడం) కింద నిర్బంధించి, తర్వాత విడుదల చేసినట్లు అధికారి తెలిపారు.దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చినప్పుడు, నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 323 కింద.. ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశామని, అతను పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. వీడియోను చిత్రీకరించి ప్రసారం చేసిన వ్యక్తిపై బాధితురాలు ఫిర్యాదు చేసిందని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.



Tags:    

Similar News