తిరుపతిలో ప్రేమజంట బలవన్మరణం
విందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలోని ఓ లాడ్జిలో సోమవారం ఉదయం 7 గంటలకు దిగిన వీరిద్దరూ ..
lovers suicide in tirumala
ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చోటుచేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలోని ఓ లాడ్జిలో సోమవారం ఉదయం 7 గంటలకు దిగిన వీరిద్దరూ మంగళవారం ఉదయం విగతజీవులుగా కనిపించారు. యువతికి ఇటీవలే వేరే యువకుడితో వివాహమయింది. జీవితాంతం కలిసుండాలని ప్రేమించుకున్న ఇద్దరూ.. పెళ్లి చేసుకోలేకపోయామన్న బాధతో ఇలా చేసినట్లు తెలుస్తోంది.
ప్రేమజంటలో యువతి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషగా గుర్తించారు. యువకుడు హైదరాబాద్ కు చెందిన కృష్ణారావుగా గుర్తించారు. లాడ్జిసిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇరు కుటుంబాల సభ్యులకు సమాచారమిచ్చారు.