Murder Case : భార్యను కత్తితో నరికి చంపి.. కారణాలను ఫేస్ బుక్ లైవ్ లో వివరించి?
కేరళ రాష్ట్రంలో భార్యను భర్త హతమార్చాడు. హత్య చేయడంతో ఆగకుండా ఫేస్ బుక్ లైవ్ లో తాను తన భార్యను హత్య చేసినట్లు తెలిపాడు
కేరళ రాష్ట్రంలో భార్యను భర్త హతమార్చాడు. హత్య చేయడంతో ఆగకుండా ఫేస్ బుక్ లైవ్ లో తాను తన భార్యను హత్య చేసినట్లు తెలిపాడు. కేరళ రాష్ట్రంలోని పునలూరు సమీపం కూతనాడిలో ముప్ఫయి తొమ్మిదేళ్ల మహిళను ఆమె భర్త కత్తితో నరికి చంపాడు. అనంతరం ఫేస్‌బుక్ లైవ్‌లో హత్య చేసినట్టు ప్రకటించాడు. మృతురాలు శాలిని వలక్కొడు మండలం కూతనాడి, ప్లాచేరి వాసిగా పోలీసులు గుర్తించారు. . భర్త ఐజాక్ హత్య అనంతరం పునలూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు.
ఈరోజు ఉదయం...
సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో వంటగది వెనుక పైపులైన్ దగ్గర స్నానం చేసేందుకు వెళ్లిన శాలినిపై ఐజాక్ కత్తితో దాడి చేశాడు. మెడ, ఛాతి, వీపుపై తీవ్ర గాయాలు చేశారు. దీంతో శాలిని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత ఐజాక్ తన భార్యను ఎందుకు హత్యచేసిందీ వివరించాడు. హత్య చేసిన వెంటనే ఐజాక్ ఫేస్‌బుక్ లైవ్‌లో తన భార్య తనకు నమ్మకద్రోహం చేశారని పేర్కొన్నాడు. బంగారు నగలను కూడా తనకు తెలియకుండా విక్రయించుకుందని ఆరోపించాడు.
కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో...
అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తానే భార్యను చంపానని పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఇంటికి చేరుకుని శాలిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరి పందొమిదేళ్ల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేశారు. హత్య జరిగిన ప్రాంతాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోంది. ఘటన స్థలం నుంచి ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నారు. హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దంపతులిద్దరి మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.