Murder Case : బాలికను హత్య చేసింది వాడేనా? అక్కడే తిరుగుతున్నాడంటే?
హైదరాబాద్ కూకట్ పల్లిలో బాలిక హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
హైదరాబాద్ కూకట్ పల్లిలో బాలిక హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కూకట్ పల్లిలో బాలిక హత్య కేసు సంచలనం కలిగించింది. ఇందులో ఒక అనుమాతుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అపార్ట్ మెంట్లో ఉంటూ తన తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిన అదను చూసి నిందితుడు దాడి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నిన్న కూకట్ పల్లిలోని సంగీత్ నగర్ లో జరిగిన బాలిక హత్య సంచలనం కలిగించిన నేపథ్యంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
సీసీ కెమెరాలను పరిశీలించి...
సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు. అయితే కొత్త వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాలేదని పోలీసులు గుర్తించారు. ఒక వ్యక్తి మాత్రం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ యువకుడు బాలిక కుటుంబం ఉంటున్న ఇంట్లోనే అద్దెకు ఉంటున్నట్లు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తన భార్యకు అనారోగ్యానికి కారణం ఈ కుటుంబం అని భావించి కక్ష పెంచుకున్న యువకుడు బాలికను హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాధమికంగా ఇక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో...
అనుమానంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే బాలికపై అత్యాచారానికి ప్రయత్నించి బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. చుట్టుపక్కల వారిని కూడా పోలీసులు విచారించారు. డాగ్ స్వ్కాడ్ ను కూడా రప్పించి నిందితుడి కోసం వెతికారు. కానీ చివరకు అక్కడే అద్దెకు ఉంటున్న యువకుడిపైనే అనుమానాలు బలపడటంతో అతనిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన సమాచారం మాత్రం పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. మధ్యాహ్నానికి మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశముంది.