వందల కోట్లు సంపాదించారు.... జైలు పాలయ్యారు

డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వ్యాపారవేత్తలను రిమాండ్ కు తరలించారు

Update: 2022-01-21 07:46 GMT

డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వ్యాపారవేత్తలను రిమాండ్ కు తరలించారు. మొత్తం ఏడు మంది వ్యాపారులను ఈ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన టోనీ ద్వారా ఈ వ్యాపార వేత్తలు డ్రగ్స్ ను తీసుకుంటున్నట్లు విచారణలో తేలడంతో వారిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఓయో రూములో దిగుతూ టోనీ బ్యాచ్ ఈ వ్యాపార వేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.

గ్రాము ఇరవై వేలు...
వీరికి గ్రాము కొకైన్ ను 20 వేల రూపాయల చొప్పున టోనీ బ్యాచ్ విక్రయించేది. గత నాలుగేళ్లుగా టోనీ నుంచి వ్యాపారులు డ్రగ్స్ తీసుకుంటున్నారు. అరెస్టయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నిరంజన్ జైన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. నిరంజన్ జైన్ అనేక ప్రభుత్వ ప్రాజెక్టు పనులతో పాటు అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఈయన తరచూ అధికారులకు పార్టీలు ఇచ్చే అలవాటు ఉంది. ఈ పార్టీల్లోనూ డ్రగ్స్ వాడకం జరిగిందా? లేదా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మూడేళ్ల నుంచి....
ఇక పాతబస్తీ కేంద్రంగా మసాలా దినుసుల వ్యాపారం చేస్తూ ఏడాదికి వందల కోట్లరూపాయలు సంపాదిస్తున్న ఆనంద్ సయితం ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. మూడు సంవత్సరాల నుంచి ఆనంద్ టోనీ ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశ్వత్ జైన్ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఏపీ, తెలంగాణలో నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలకు ఈటా, సర్ఫ్ ను జైన్ పరిచయం చేశాడు.
క్లాస్‌మేట్స్ మాత్రమే కాదు...
ఇక ప్రముఖ కాంట్రాక్టరు దండుసూర్య, సుమంత్ లను కూడా అరెస్ట్ చేశారు. ఈయన హైదరాబాద్ నగరంలో బ్రిడ్జిలను నిర్వహిస్తున్నారు. మరో ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ తో పాటు ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్న చలసాని వెంకట్ కూడా అరెస్ట్ అయ్యారు. వీరిద్దరూ ఒకే స్కూల్ లో చదువుకు్నారు. ఇద్దరూ కలసి వ్యాపారంతో పాటు డ్రగ్స్ కు కూడా అలవాటు పడ్డారని పోలీసులు చెబుతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త తమ్మినేద సాగర్ ను కూడా అరెస్ట్ చేశారు. వీరందరికీ 14 రోజుల రిమాండ్ విధించింది.


Tags:    

Similar News