కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్ట్

కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2024-03-23 12:55 GMT

కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల గ్రామంలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదు చేశారు. భూ కబ్జా కేసులో కూరుకుపోయిన కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు.

భూ కబ్జా కేసులో...
ఓఎస్ఆర్ ప్రాజెక్టు సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రయివేటు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని, కన్నారావు తమ అనుచరులతో కలసి జేసీబీని తీసుకు వచ్చి భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News