ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్.. మూడు రోజుల పోలీసు కస్టడీ..!

సాదుద్దీన్​ మాలిక్​(18), మరో నలుగురిని ఇప్పటికే అరెస్ట్​ చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో A1 నిందితుడైన సాదుద్దీన్ మాలిక్

Update: 2022-06-08 06:29 GMT

జూబ్లీహిల్స్​లో బాలికపై అఘాయిత్యం కేసులో ఎమ్మెల్యే కొడుకును పోలీసులు అరెస్ట్​చేశారు. అతడిని ఆరో నిందితుడిగా చేర్చి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సాదుద్దీన్​ మాలిక్​(18), మరో నలుగురిని ఇప్పటికే అరెస్ట్​ చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో A1 నిందితుడైన సాదుద్దీన్ మాలిక్ మూడురోజుల కస్టడికి ఇచ్చింది కోర్టు. సాదుద్దీన్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నేరం జరిగిన ప్రదేశంలో సీన్ రికన్‌స్ట్రక్న్ చేయాల్సి ఉందని.. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించాలని ప్రాసిక్యూషన్ తన వాదనలో పేర్కొంది. ఇందుకోసం నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని తెలిపింది. ఈ క్రమంలోనే రేపటి నుంచి మూడు రోజుల పాటు సాదుద్దీన్‌ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో AIMIM (ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా పేర్కొన్నారు. మొత్తం ఆరుగురు నిందితులు ఒకరు 18 సంవత్సరాల కంటే పైన ఉన్నవాళ్లు కాగా.. మిగిలిన వాళ్లు ఐదుగురు మైనర్లు ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. మొదటి ఐదుగురిపై సామూహిక అత్యాచారం, అపహరణ, స్వచ్ఛందంగా గాయపరచడం, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నిందితులుగా పేర్కొన్నారు. వారికి మరణశిక్ష, 20 ఏళ్ల జైలు లేదా జీవితకాలం జైలు శిక్ష విధించవచ్చు.
గత వారం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కారులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారని ఆరోపిస్తూ వీడియో క్లిప్, ఫోటోలను విడుదల చేశారు. పోలీసులు ఈ ఘటనను దాచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని ఆరోపించారు. మొదట్లో ఎంఐఎం నేత కొడుకు గ్యాంగ్‌రేప్‌లో పాల్గొనలేదని పోలీసులు సమర్థించారు. "అతను ఇన్నోవాలో కొద్ది దూరం ప్రయాణించి, ఫోన్ కాల్ రావడంతో తిరిగి వచ్చాడని అందుకే ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు" అని కమిషనర్ చెప్పారు. బీజేపీ నాయకుడు విడుదల చేసిన వీడియో, ఫోటోల తర్వాత మాత్రమే బాలికపై ప్రాథమిక లైంగిక వేధింపులో అతని ప్రమేయం తమకు తెలిసిందని అంగీకరించారు.
గ్యాంగ్ రేప్ సెక్ష‌న్లు న‌మోదు చేసిన నేప‌థ్యంలో నిందితుల‌కు మూడు ర‌కాల శిక్ష‌లు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. 20 ఏళ్ల జైలు శిక్ష‌, లేదంటే జీవించి ఉన్నంత కాలం పాటు జైలు శిక్ష‌, లేదంటే ఉరి శిక్ష‌ ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. అత్యాచారానికి పాల్ప‌డ‌ని నిందితుడికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మైనర్ బాలిక పబ్ కు వచ్చింది. దాదాపు 100 మంది విద్యార్థులు తలా ₹ 1,300 చెల్లించి పబ్‌ను బుక్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీద మైనర్‌లు ఒక్కొక్కరికి ₹ 900 వరకు పబ్‌ని బుక్ చేసుకున్నారు. "మధ్యాహ్నం 3 గంటల సమయంలో పబ్‌లోనే బాలికపై వేధింపులు మొదలయ్యాయి. ఆ తర్వాత సాయంత్రం 5:40 గంటలకు ఆమె స్నేహితుడు వెళ్లిన తర్వాత వారు ఆమెను పబ్ వెలుపల అడ్డుకున్నారు" అని హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీపీ ఆనంద్ చెప్పారు. బాలికతో తొలి ముద్దాయిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ మాట క‌లిపాడు. ఇతను ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు.. అంతకన్నా ముందు నిందితుడిగా ఉన్న మ‌రో మైన‌ర్ కూడా ఆమెతో మాట క‌లిపాడు. వారిద్ద‌రూ బాధితురాలిని లైంగికంగా వేధించారు. త‌న స్నేహితురాలితో క‌లిసి బాధితురాలు బ‌య‌ట‌కు వెళ్లింది. ప‌బ్‌లో సాదుద్దీన్‌తో క‌లిసి ఐదుగురు మైన‌ర్లు ప్లాన్ వేసుకున్నారు. బ‌య‌ట‌కు వెళ్లిన బాధితురాలిని ఇద్ద‌రు నిందితులు త‌మ‌ బెంజ్‌ కారులో ఎక్కించుకుని బంజారా హిల్స్‌లోని ఓ బేక‌రీకి వెళ్లారు. వారిని అనుస‌రించి ఇన్నోవా కారులో మ‌రో న‌లుగురు వెళ్లారు. బేక‌రీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆరుగురు నిందితులు బాధితురాలిని ఇన్నోవాలో ఎక్కించుకుని జూబ్లీ హిల్స్ పెద్ద‌మ్మ గుడి వెనుక నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లారు. కారులో వెళుతుండ‌గానే ఆమెపై నిందితులు రేప్ చేశారట. అనుకున్న ప్రాంతానికి చేరుకున్నాక బాధితురాలిపై ఆరుగురు నిందితులు వ‌రుస‌గా అత్యాచారం చేశారు. వీడియోలు తీసుకున్నారట. వీడియోల‌ను ఒక‌రితో మ‌రొక‌రు షేర్ చేసుకున్నారు. అత్యాచారం త‌ర్వాత బాధితురాలిని ఆమ్నేషియా ప‌బ్ వ‌ద్దే వ‌దిలివెళ్లారు. ఆ తర్వాత బాధితురాలు తన తండ్రిని పిలిపించుకుని ఇంటికెళ్లిపోయింది. గ్యాంగ్ రేప్ సెక్ష‌న్లు న‌మోదు చేసిన నేప‌థ్యంలో నిందితుల‌కు మూడు ర‌కాల శిక్ష‌లు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. 20 ఏళ్ల జైలు శిక్ష‌, లేదంటే జీవించి ఉన్నంత కాలం పాటు జైలు శిక్ష‌, లేదంటే ఉరి శిక్ష‌ ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. అత్యాచారానికి పాల్ప‌డ‌ని నిందితుడికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.
నిందితులు 11 మరియు 12 తరగతుల విద్యార్థులు. రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందినవారు. పోలీసులకు పట్టుబడిన మైనర్లలో ఒకరు రాష్ట్ర అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన స్థానిక నాయకుడి కుమారుడు. మరో మైనర్ సంగారెడ్డికి చెందిన టీఆర్ఎస్ నేత కుమారుడు.


Tags:    

Similar News