Benguluru : బెంగళూరులో అమానవీయ ఘటన
బెంగళూరులో అమానవీయ ఘటన జరిగింది. ఇందిరానగర్‌లో 33 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది.
బెంగళూరులో అమానవీయ ఘటన జరిగింది. ఇందిరానగర్‌లో 33 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నవంబర్ 1న చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 11.57 గంటల సమయంలో ఆమె తన పెంపుడు కుక్కను నడిపించుకుంటూ వెళ్తుండగా, ముప్పై ఏళ్ల వయస్సులో ఉన్నట్లు కనిపించిన ఓ వ్యక్తి తనను అని పిలిచి ఆమె పట్ల అతను బహిరంగంగా అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.
మహిళపై ...
ఆకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో షాక్‌కు గురైన ఆమె వెంటనే తన కుక్కతో ఇంటికి పరుగెత్తి వెళ్లి, తర్వాత ఈ విషయాన్ని తన సోదరి, స్నేహితురాలికి తెలిపింది. ఈ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తిపై బెంగళూరు పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. సీసీ టీవీ పుటేజీల ద్వారా తాము దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.