ఆ భారత సంతతి కుటుంబంలో ఒక్కరూ మిగలలేదు

అమెరికా, న్యూజెర్సీలో తమ ఇంటిలో ఇద్దరు చిన్న పిల్లలతో సహా నలుగురు సభ్యులతో

Update: 2023-10-07 03:54 GMT

అమెరికా, న్యూజెర్సీలో తమ ఇంటిలో ఇద్దరు చిన్న పిల్లలతో సహా నలుగురు సభ్యులతో కూడిన భారతీయ అమెరికన్ కుటుంబం చనిపోయి పడి ఉన్న విషయం గురించి తెలుసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత సంతతికి చెందిన దంపతులు, వారి ఇద్దరు పిల్లలు వారి ఇంట్లో అనుమాస్పదంగా మరణించారు. వా

భారత సంతతికి చెందిన తేజ్ ప్రతాప్ సింగ్ (43) తన భార్య సోనాల్ పరిహార్ (42) 10 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల బాలుడితో కలిసి ప్లెయిన్స్ బోరోలోని ఓ ఇంట్లో నివసిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం పోలీసులకు వారి బంధువు ఒకరు ఫోన్ చేశారు. తేజ్ ప్రతాప్ సింగ్ కుటుంబం ఎలా ఉందో కనుక్కోవాలంటూ అభ్యర్థించారు. దీంతో పోలీసులు ఆ కుటుంబం నివసించే ఇంటికి వెళ్లి చూడటంతో నలుగురు కుటుంబ సభ్యులు విగతజీవులుగా కనిపించారని ప్లెయిన్స్ బోరో పోలీస్ డిపార్ట్ మెంట్ తెలిపింది. తేజ్ ప్రతాప్ సింగ్ నెస్ డిజిటల్ ఇంజనీరింగ్ లో లీడ్ ఎపిక్స్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆయన భార్య కూడా మరో ఐటీ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నారు. ప్రతాస్ సింగ్ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతాప్ సింగ్ ముందుగా తన కుటుంబాన్ని హతమార్చి, తరువాత సూసైడ్ చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ 5న మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటన పట్ల స్థానికంగా ఉన్న ప్రజలు భయపడకండని.. ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఆ ప్రకటన తెలిపింది. ప్లెయిన్స్‌బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డిటెక్టివ్ అట్కిన్‌సన్‌ 609-799-2333కి లేదా మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్‌లోని డిటెక్టివ్ మోరిల్లోకి 732-745-8843కు కాల్ చేయమని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీకి తమకు అందించాలని కోరారు.


Tags:    

Similar News