Uttar Pradesh : భార్య నుంచి నన్ను కాపాడండి బాబోయ్.. భర్త ఆవేదన.. భర్తను చూసి హోటల్ నుంచి జంప్
భార్య నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఒక భర్త పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది
భార్య నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఒక భర్త పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఆ భర్త పోలీసులను వేడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎక్కువగా వివాహేతర సంబంధాలు భర్తల ఉసురు తీస్తున్నాయి. ప్రియుడితో కలసి భర్తను చంపేస్తున్నఘటనలు భారత్ లో అనేకం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని బరౌత్ పట్టణంలోని చప్రౌతి రోడ్డులో ఒక హోటల్ లో ప్రియుడు శోభిత్ తో కలసి యువతి వచ్చింది.
వివాహేతర సంబంధంతో...
ఉత్తర్ ప్రదేశ్ లోని బాగావత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఒక వివాహిత మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన ప్రియుడి శోభిత్ తో కలసి వెళుతుండగా అనుమానించిన మహిళ భర్త, అత్తమామలు ఆమెను వెంబడించారు. ఇద్దరూ హోటల్ కు చేరుకున్నారు. అయితే హోటల్ వద్ద తన భర్త, అత్తమామలను చూసిన ఆ మహిళ పన్నెండు అడుగుల ఎత్తునుంచి దూకి పారిపోయింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. అయితే ప్రియుడు శోభిత్ ను పట్టుకుని భర్త, అత్తమామలు పోలీసులకు అప్పగించారు.
కుమారుడు కూడా ఉన్న మహిళ...
మహిళకు వివాహమై భర్తతో పాటు కుమారుడు ఉండగా వివాహేతర సంబంధం శోభిత్ తో పెట్టుకుంది. ఇద్దరూ రహస్యంగా తమ ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అనుమానం వచ్చిన భర్త వారిని వెంబడించి పట్టుకుని సీక్రెట్ ను రివీల్ చేశాడు. తన భార్య ప్రియుడితో కలసి తనను చంపేస్తుందని, పెల్లి కాకముందు నుంచే సంబంధాలు ఉండటంతో తన ప్రాణాలకు రక్షణ లేదంటూ భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాలని కోరాడు. అయితే ఈ ఘటనపై ప్రియుడి శోభిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.