Kadapa : అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణ హత్య
అప్పు తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగిందుకు ఒక యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన కడలో చోటు చేసుకుంది
four murders in hyderabad
అప్పు తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగిందుకు ఒక యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన కడలో చోటు చేసుకుంది. దీపావళి పండగ రోజు ఈ విషాదం జరగడంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కడప పట్టణంలోని చిన్న చౌక్ ప్రాంతానికి చెందిన కిరణ్ దగ్గర సాయిపేట కు చెందిన మహేష్ యాభైవేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
కత్తితో దాడి...
అయితే తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమని కిరణ్ మహేష్ ను నిన్న రాత్రి కోరాడు. పండగ పూట తనను అప్పు అడిగినందుకు ఆగ్రహించిన మషేహ్ కిరణ్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. కిరణ్ ను హత్య చేసిన మహేష్ వెంటనే చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.