కల్తీ సారా : పదికి పెరిగిన మృతుల సంఖ్య
తమిళనాడులో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకూ కల్తీసారా తాగి పది మంది మరణించారు.
liquor shops in AP
తమిళనాడులో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకూ కల్తీసారా తాగి పది మంది మరణించారు. మరో పన్నెండు మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు అధికారులపై ఇప్పటికే స్టాలిన్ సర్కార్ చర్యలు తీసుకుంది.
అధికారులపై వేటు...
ఇద్దరు ఇన్స్‌పెక్టర్లపై వేటు వేసింది. . తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరక్కాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్తీ సారా ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై విచారణకు ఆదేశించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ సారా తయారు చేస్తున్న వారిపై దాడులను ముమ్మరం చేశారు.