Murder : మంచాన ఉన్న భర్తను కిరాతకంగా చంపేసిన భార్య.. ప్రియుడు
మహారాష్ట్రలోని నాగపూర్ లో భార్య దిశ తన ప్రియుడు రాజాబాబుతో కలసి భర్త చంద్రశేఖర్ ను హత్యచేసింది
మానవ సంబంధాలు మట్టి కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. దేశంలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో భార్య భర్తను హత్య చేయించిన ఘటనలు జరుగుతున్నాయి. మేఘాలయ హనీమూన్ మర్డర్ తర్వాత ఈ తరహా కేసులు దేశంలో ఎక్కువవుతున్నాయి. కట్టుకున్న వాడిని హతమార్చడానికి భార్యలు ఏ మాత్రం వెనకడాటం లేదు. ఇటీవల మేఘాలయలో.. మొన్న గద్వాల్ లో నిన్న బీహార్ లో భార్యలు చేసిన హత్యలు మరిచిపోక ముందే తాజాగా మహారాష్ల్రలోనూ భార్య భర్తను తన ప్రియుడితో కలసి చంపేసింది.
నాగపూర్ లో ఉన్న...
మహారాష్ట్రలోని నాగనపూర్ లో జరిగిన ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగు చూసినా పోలీసులు ఈ కేసును ఛేదించారు. నాగపూర్ కు చెందిన చంద్రశేఖరన్ రామ్ తేకే, దిశ ఇద్దరు భార్యాభర్తలు. చంద్రశేఖరన్ అనారోగ్యం పాలయి గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానపడ్డారు. మంచాన పడిన భర్త ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన భార్య దిశ మాత్రం వేరుగా ఆలోచించింది. అదే ప్రాంతానికిచెందిన రాజాబాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే మంచంలో ఉన్న చంద్రశేఖరన్ కు ఈ విషయం తెలియడంతో దిశను మందలించాడు. ఇద్దరూ తరచూ కలుసుకోవడాన్ని చంద్రశేఖరన్ అభ్యంతరం తెలిపాడు.
అడ్డుగా ఉన్నాడని...
దీంతో తన వివాహేతర సంబంధానికి మంచంలో ఉన్న భర్త చంద్రశేఖరన్ అడ్డుగా ఉన్నాడని భావించి తొలగించుకోవడానికి దిశ ప్లాన్ చేసింది. దంతో రాత్రి మంచంపై పడుకున్న భర్త చంద్రశేఖరన్ చేతులను గట్టిగా దిశ పట్టుకుంది. రాజాబాబు మాత్రం చంద్రశేఖర్ ను గొంతుపిసికి చంపేశాడు. అయితే తన భర్త అనారోగ్యంతోనే మరణించాడని బంధువులను, కుటుంబ సభ్యులను దిశ నమ్మించబోయింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో దిశతో పాటు రాజాబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.