పెళ్లికొడుకుపై కత్తితో దాడి.. నిందితుడ్ని వెంటాడిన డ్రోన్ కెమెరా

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి మంటంపలో వధువుపై కత్తితో దాడికి దిగారు

Update: 2025-11-13 05:39 GMT

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి మంటంపలో వధువుపై కత్తితో దాడికి దిగారు. ఈ ఘటనతో వధువు బంధువులు అప్రమత్తమై అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ద్విచక్రవాహనంపైకి ఎక్కి పరారయ్యాడు. మహారాష్ట్రలోని అమరావతిలో ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకుపై కత్తిపోట్లు కలకలం రేపాయి. పెళ్లికుమారుడు సుజల్ రామ్ సముద్రపై జితేంద్ర అనే వ్యక్తి కత్తితో మూడు సార్లు దాడి చేశాడు.

ద్విచక్రవాహనంపై...
తర్వాత ద్విచక్ర వాహనంపై నిందితుడు పరారయ్యాడు. పెళ్లిలో ఉన్న ఫొటో గ్రాఫర్ డ్రోన్ కెమెరాతో నిందితుడిని రెండు కిలోమీటర్ల మేరకు వెంబడించాడు. ఆ ఫుటేజీతోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అయితే డీజేప డాన్స్ విషయంలో జరిగిన గొడవే దాడికి కారణమని తెలుస్తోంది. పెళ్లికొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News