ప్రజల్లో మంచి పేరు.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఐఏఎస్

చివరికి డ్రీమ్ జాబ్ చేసుకుంటూ లంచం తీసుకుని దొరికిపోవడం చాలా బాధేస్తుంది.

Update: 2025-06-10 08:15 GMT

odisha

ఎంతో కష్టపడి మరీ ర్యాంకులు సాధించి.. చివరికి డ్రీమ్ జాబ్ చేసుకుంటూ లంచం తీసుకుని దొరికిపోవడం చాలా బాధేస్తుంది. ఒడిశాలోని కాళహండి జిల్లాలో ధర్మగడ్‌ సబ్‌కలెక్టర్‌ ధీమాన్‌ చక్మా ఓ వ్యాపారి నుంచి 10 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు. విషయం తెలుసుకొన్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆ ఐఏఎస్ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించగా 47లక్షల రూపాయలు దొరికాయి.

త్రిపురకు చెందిన ధీమన్‌ ఛక్మాకు గత ఆరేళ్లుగా ప్రజల్లో ఎంతో మంచిపేరుంది. రెండుసార్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో మెరుగైన ర్యాంక్‌లు సాధించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఛక్మాను విజిలెన్స్‌ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా లంచం కేసులో అరెస్ట్‌ చేశారు.

Tags:    

Similar News