ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు యువకుల అరెస్ట్?

ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది

Update: 2025-05-18 06:47 GMT

soldier

ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఉగ్రవాద ఆలోచనలతోఇద్దరు యువకులపై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టి అరెస్టు చేశారు. అందిన సమాచారంతో హైదరాబాద్ కు చెందిన ఇరవై ఎనిమిదేళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

పేలుళ్లకు కుట్ర జరిపారంటూ...
కాగా వీరు పాక్ లోని ఐసిస్ సాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లు సృష్టించడానికి ప్లాన్ చేసినట్లు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో పేలుళ్లు జరపడానికి కుట్రపన్నారని, అయితే ఈ కుట్రను ముందుగానే భగ్నం చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి వెనక ఎవరున్నారు? ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారన్నది విచారణలో తెలియనుంది.


Tags:    

Similar News