గే డేటింగ్ యాప్ ద్వారా మరో దోపిడీ

గ్రైండర్ డేటింగ్ యాప్‌ను కొందరు దుర్వినియోగం

Update: 2025-02-10 08:50 GMT

గ్రైండర్ డేటింగ్ యాప్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ యాప్ లో పరిచయాలు పంచుకోవడం, ఆ తర్వాత దోపిడీలకు పాల్పడడం జరుగుతూ ఉంది. తాజాగా మరో యువకుడిని దోచుకున్నారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకి చెందిన ఒక యువకుడు ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీ సభ్యుల కోసం తీసుకొచ్చిన ఉచిత డేటింగ్ యాప్‌లో కలుసుకున్న తర్వాత ఒక వ్యక్తిని దోచుకున్నాడు. ఆ తర్వాత అతడిని ఫిల్మ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నివేదికల ప్రకారం, నిందితుడిని డబీర్‌పురాకు చెందిన 25 ఏళ్ల ఫర్హాన్ బేగ్‌గా గుర్తించారు. డేటింగ్ యాప్ ‘గ్రైండర్’లో సైన్ అప్ చేసి బాధితుడితో స్నేహం చేశాడు. ఆన్‌లైన్ సంభాషణల తర్వాత, ఫిల్మ్ నగర్‌లోని ఒక ఇంటికి తన 22 ఏళ్ల స్నేహితుడిని ఆహ్వానించాడు. ఫర్హాన్ అతడిని బెదిరించాడు. అతని ఇ-వాలెట్‌కి 10,000 రూపాయలు పంపించుకున్నాడు. తప్పించుకోడానికి ఎటువంటి అవకాశం లేకపోవడంతో, బాధితుడు అతను డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించి తన ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం పోలీసులను ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫర్హాన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
గత వారం, మీర్‌చౌక్ పోలీసులు 'గ్రైండర్' యాప్‌లో ఒక వ్యక్తిని ప్రలోభపెట్టి దోచుకున్నందుకు ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు.


Tags:    

Similar News