Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. పదిహేను మంది మృతి
శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు లోయలోపడటంతో పదిహేను మంది మరణించారు
శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు లోయలోపడటంతో పదిహేను మంది మరణించారు. రావణ ఎల్లా ఘాట్ రోడ్డు లో ఈ ప్రమాదం జరిగింది. సెలవులు కావడంతో మినీ బస్సులో యాత్రలకు బయలుదేరి వెళ్లారు. అయితే మృతి చెందిన వారంతా మున్సిపల్ కార్మికులు అని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో పన్నెండు మంది వరకూ గాయపడినట్లు సమాచారం.
రావణ ఎల్లా ఘాట్ రోడ్డులో....
వాతావరణం అనుకూలించక ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. లోతులో ఉన్న లోయలో పడటంతో అనేక మందికి గాయాలయ్యాయి. దీంతో సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.