స్కూల్ కు వెళ్లే అమ్మాయిలకు పెన్నులు, పెన్సిళ్లు ఆశచూపి?

స్కూల్ కు వెళ్లే విద్యార్థినులకు పెన్నులు, పెన్సిళ్లు ఆశచూపించాడు. నమ్మి దగ్గరకు వచ్చిన వారితో అసభ్యంగా ప్రవర్తించాడు

Update: 2021-12-06 12:56 GMT

స్కూల్ కు వెళ్లే విద్యార్థినులకు పెన్నులు, పెన్సిళ్లు ఆశచూపించాడు. దీంతో బాగా నమ్మిన ఆ విద్యార్థినులు అతని వద్దకు వెళ్లగా.. అదే అదనుగా భావించి వారితో అసభ్యంగా ప్రవర్తించాడో కామాంధుడు. ఫలితంగా మహిళల చేతిలో చితకొట్టుడు కొట్టించుకున్నాడు. ఈ ఘటన విశాఖలో మల్కాపురం పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. దోమాన చిన్నారావు అనే రౌడీ షీటర్ విద్యార్థినులపై కన్నేశాడు. కొద్దిరోజులగా వారికి పెన్నులు, పెన్సిళ్ల ఆశచూపుతూ.. నెమ్మదిగా తన బుట్టలో వేసుకున్నాడు. అమ్మాయిలు తన మాట వింటున్నారని నమ్మకం వచ్చాక వారికి నమ్మశక్యమైన మాటలు చెప్పడం మొదలు పెట్టాడు.

నమ్మిన విద్యార్థినులు...
అంకుల్ చాలా మంచివాడు అని నమ్మిన విద్యార్థినులు అతని మాటలు నమ్మి అతని వద్దకు వెళ్లగా.. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు చిన్నారావు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు బాగోతం బయటపడింది. కోపోద్రిక్తులు అయిన మహిళలంతా కలిసి ప్రకాశ్ నగర్ రౌడీ షీటర్ పై దాడి చేశారు. రోడ్డుపైనే బడితపూజ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని రౌడీ షీటర్ చిన్నారావును అదుపులోకి తీసుకున్నారు. ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు.


Tags:    

Similar News