హైదరాబాద్ లో మహిళను హత్య చేసి.. బంగ్లాదేశ్ సరిహద్దుకు పారిపోయాడు

నానకరామ్ గూడ లో మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా దారుణంగా హతమార్చి

Update: 2023-09-06 08:40 GMT

నానకరామ్ గూడ లో మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా దారుణంగా హతమార్చి పశ్చిమ బెంగాల్ కు పారిపోయిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన సైబరాబాద్ పోలీసులు ఈ హత్యకేసును చేధించారు. నిందితుడితో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

గౌలిదొడ్డి కేశవ్‌నగర్‌లో ఉంటున్న మహిళ(33) చనిపోయి కనిపించింది. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని విప్రో జంక్షన్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం సెల్లార్‌లో మృతదేహాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తుక్కు వస్తువుల కోసం ఆ భవనం వద్దకు మహిళ వచ్చి ఉంటుందని, ఎవరో బండరాయితో మోది హత్య చేసి ఉంటారని భావించారు. ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానించారు. బాధిత కుటుంబానికి భవన నిర్మాణ సంస్థ రూ.10 లక్షల పరిహారం అందజేసింది. ఈ హత్య ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది.
ఈ కేసును విచారించిన పోలీసులు నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితులు పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశ్ కు దగ్గరగా ఉన్న గ్రామంలో తలదాచుకున్నారు. బెంగాల్ కు చెందిన శ్యామల్ రాయ్, ఇంకో ఇద్దరు హత్య చేసినట్లు గుర్తించారు. శ్యామల్ రాయ్ కు సదరు మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఆగస్టు 25వ తేదీన కలుసుకున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే ఆమె శ్యామల్ దారుణంగా చంపేశాడు. హత్య తర్వాత బెంగాల్ పారిపోయాడు శ్యామల్ రాయ్. మాల్డా జిల్లా అడదంగాకు చెందిన వ్యక్తి శ్యామల్ రాయ్. సిగ్నల్స్ ద్వారా అతడిని ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. శ్యామల్ రాయ్ కు సహకరించిన వ్యక్తులను పట్టుకోడానికి తెప్పలలో వెళ్లిన పోలీసులు. ఎట్టకేలకు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎంతో సాహసోపేతంగా ఈ హత్య కేసును చేధించారు హైదరాబాద్ పోలీసులు.


Tags:    

Similar News