ఫస్ట్ డే ఇన్ స్టా.. సెకండ్ డే వాట్సాప్.. మూడోరోజు గ్యాంగ్ రేప్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని సులేమాన్ నగర్ లో నివసించే సాజిత్ (27) ప్రైవేటు ఉద్యోగి. రెండ్రోజుల క్రితం..

Update: 2022-03-02 05:41 GMT

రాజేంద్రనగర్ : రెండ్రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో ఓ యువకుడు అమ్మాయి ప్రొఫైల్ చూసి బాగానే ఉంది కదా అని రిక్వెస్ట్ పెట్టాడు. అతని రిక్వెస్ట్ ను ఏమాత్రం ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసేసింది ఆ యువతి. నెమ్మదిగా ఆమెతో మాటలు కలిపాడు. రెండో రోజు వాట్సాప్ నెంబర్ ఇవ్వమని అడిగాడు. హా.. నెంబరే కదా. ఏదైనా తేడా జరిగితే బ్లాక్ చేయొచ్చులే అని ఇచ్చేసింది. గ్యాప్ లేకుండా రోజంతా ఇద్దరూ వాట్సాప్ లో ఛాటింగ్ చేసుకున్నారు. తనను న్యూడ్ ఛాటింగ్ చేయాలని అడిగాడు సాజిత్. అతని మాటలు నమ్మిన యువతి న్యూడ్ ఛాటింగ్ చేయగా.. అదంతా సాజిత్ రికార్డ్ చేశాడు. మూడోరోజు అతను కలుద్దామని అడిగే సరికి.. సరేనని అతడిని కలిసేందుకు రెడీ అయింది. తీరా కలిసిన తర్వాత తెలిసింది.. అతనిలో ఓ మృగం కూడా ఉందని.

Also Read : నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు మృతి.. కారణం అదేనా ?

మాయమాటలు చెప్పి తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి.. యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితులు నలుగురు కూడా యువతి పై లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి సీక్రెట్ గా 100కు డయల్ చేయడంతో.. ఆ దుర్మార్గుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజేంద్రనగర్ సీఐ కనకయ్య తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని సులేమాన్ నగర్ లో నివసించే సాజిత్ (27) ప్రైవేటు ఉద్యోగి. రెండ్రోజుల క్రితం సంతోష్ నగర్ కు చెందిన ఓ యువతి(20)తో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని ఛాటింగ్ చేసుకున్నారు. సాజిత్ రిక్వెస్ట్ మేరకు ఆ యువతి న్యూడ్ ఛాటింగ్ చేయగా.. అదంతా రికార్డ్ చేసి, తనతో రావాలని బెదిరించాడు.

Also Read : ఏడో రోజు యుద్ధం.. భయానకమే

మంగళవారం సదరు యువతిని కలిసిన సాజిత్.. తన బైక్ పై ఆమెను ఎక్కించుకుని సులేమాన్ నగర్ లో ఉంటున్న అతని స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ యువతి పై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత సాజిత్ స్నేహితులు కూడా యువతి పై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ యువతి సీక్రెట్ గా 100 డయల్ చేసి విషయం చెప్పగా.. నిందితుడు సాజిత్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News