Liberia Petrol tank Blast:ఫ్రీగా పెట్రోల్ పట్టుకోడానికి వెళితే.. ఎంతటి ఘోరం చోటు చేసుకుందంటే

రోడ్డు మీద ఏవైనా వాహనాలు పడిపోతూ ఉంటే.. అందులోని వారు ఏమైనారో కూడా పట్టించుకోరు కొందరు. ఆ వాహనాలు ఏమి ట్రాన్స్పోర్టు చేస్తున్నాయా.. వాటిని దొరికినకాడికి దోచుకు వెళదామా అన్నదే చాలా మంది ఉద్దేశ్యం

Update: 2023-12-29 11:10 GMT

Petrol tanker exploded in liberia

రోడ్డు మీద ఏవైనా వాహనాలు పడిపోతూ ఉంటే.. అందులోని వారు ఏమైనారో కూడా పట్టించుకోరు కొందరు. ఆ వాహనాలు ఏమి ట్రాన్స్పోర్టు చేస్తున్నాయా.. వాటిని దొరికినకాడికి దోచుకు వెళదామా అన్నదే చాలా మంది ఉద్దేశ్యం. మన దేశంలో కోళ్లతో వెళుతున్న ట్రక్కులు బోల్తా పడినప్పుడో.. మద్యంతో వెళుతున్న వాహనాలకు యాక్సిడెంట్లు అయినప్పుడు కొందరు అందినకాడికి తీసుకుని వెళ్ళిపోయిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ పెట్రోల్ ట్యాంకర్ కు యాక్సిడెంట్ అవ్వగా.. ఆ ఫ్రీ పెట్రోల్ ను దొంగిలించడానికి వెళ్లిన వారు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన లైబీరియాలో చోటు చేసుకుంది.

గ్యాసోలిన్‌ను సేకరించేందుకు ప్రజలు గుమిగూడినప్పుడు ఇంధన ట్యాంకర్ పేలి 40 మందికి పైగా మరణించినట్లు లైబీరియా అధికారులు తెలిపారు. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని మధ్య భాగంలోని టోటోటా పట్టణంలో జరిగిన పేలుడులో కనీసం 83 మంది గాయపడ్డారని ఆ దేశ అధికారులు తెలిపారు. బాంగ్ కౌంటీ ఆరోగ్య అధికారి డాక్టర్ సింథియా బ్లాపూక్ మాట్లాడుతూ, చనిపోయిన వారిలో చాలా మందిని సామూహికంగా పూడ్చిపెట్టారు. చాలా మంది అవశేషాలను గుర్తించలేకపోయారు. మృతదేహాలు ఎంతో దారుణంగా కాలిపోయాయి.. ఖచ్చితమైన మరణాల సంఖ్య గురించి చెప్పడం కష్టమని ఆరోగ్య అధికారులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య అధికారులు తెలిపారు. గ్యాసోలిన్‌ను సేకరించాలనే ఆశతో ఇంధన ట్యాంకర్‌ల దగ్గరకు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానికులు పెట్రోల్ పట్టుకుంటున్న సమమయంలో ట్యాంకర్ ఒక్కసారిగా పేలవడంతో(Petrol tank explode)భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే కాలిబూడిదయ్యారు.



Tags:    

Similar News