Murder : Murder : నలభై ఐదేళ్ల మహిళ.. 21 ఏళ్ల యువకుడితో లవ్.. చివరకు భర్తనే మర్డర్ చేసి?
రాజస్థాన్ లోని ఝుంఝునులో నలభై ఐదేళ్ల మహిళ పూనమ్ వివాహేతర సంబంధం కారణంగా భర్తను హత్య చేయించింది
నలభై ఐదేళ్ల మహిళ. పెళ్లయింది. భర్త పిల్లలనున్నారు. అయినా సరే ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. తనకంటే పథ్నాలుగేళ్ల చిన్నవాడితో లవ్ లో పడింది. చివరకు భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. రాజస్థాన్ లోని ఝుంఝునులో ఈ ఘటన చోటు చేసుకుంది. మరో వివాహేతర సంబంధం ఒక వ్యక్తిని బలి తీసుకుంది. హత్య చేసిన తర్వాత ప్రమాదంగా చూపించే ప్లాన్ వేశారు. కానీ పోలీసుల విచారణలో వీరి గుట్టు బయటపడింది. ఈ కేసులో నిందితురాలుపూనమ్ తో పాటు లవర్ కృష్ణకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
రహదారిపై మృతదేహం ఉండటంతో...
ఈ నెల 10వ తేదీన ఝుంఝునులోని పచేరి రహదారిపై పోలీసులు ఒక మృతదేహం గుర్తించారు. అయితే ఆ మృతదేహం సమీప గ్రామానికి చెందిన అనూప్ సింగ్ యాదవ్ ది గా గుర్తించారు. తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు తమ విచారణను ప్రారంభించారు. అనూప్ కుమార్తె యాదవ్ కుమార్తె కూడా తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే అనూప్ యాదవ్ ను ఏ వాహనం ఢీకొన్నట్లు జాడ లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి...
ఇందులో అనూప్ యాదవ్ భార్య పూనమ్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి తమదైన స్టయిల్ లో విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పూనమ్ తో పాటు ఆమె లవర్ కృష్ణకుమార్ కూడా ప్రయత్నించారని పోలీసుల విచారణలో వెల్లడయింది. మద్యం తాగించిన తర్వాత అనూప్ యాదవ్ ను ఇనుప రాడ్ తో కొట్టి చంపేశార. ఆ తర్వాత రోడ్డు పక్కన పడేశాడు. అప్పటికే రక్త స్రావం అధికం కావడంతో రోడ్డుపైనే ప్రాణాలు వదిలాడు. పూనమ్ తన ఇంటికి మంచినీటిని ట్యాంకర్ ద్వారా సరఫరా చేసే కృష్ణకుమార్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని, తర్వాత అది బలపడి ప్రేమగా మారడం, భర్త అడ్డుగా ఉండటంతో అతనిని ప్లాన్ ప్రకారం మట్టుబెట్టారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.