ప్రముఖ సింగర్ బర్డ్ డే వేడుకల్లో గంజాయి

ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయింది

Update: 2025-06-11 06:54 GMT

ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయింది. పుట్టిన రోజు సందర్భంగా మంగ్లీ చేవెళ్లలోని ఒక రిసార్టులో పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు కూడా హాజరయ్యారు. ఈ వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి ఉందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. చేవెళ్ల శివార్లలోని ఈర్లపల్లి వద్ద రిసార్టులో నిన్న రాత్రి జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించారు.

తొమ్మిదిమందికి పాజిటివ్...
మొత్తం 48 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో తొమ్మిది మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. తొమ్మిది మంది గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో మంగ్లీతో పాటు రిసార్ట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రిసార్ట్ నుంచి భారీగా విదేశీ మద్యాన్ని, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News