Maharashtra : రైలు నుంచి జారిపడి ఐదుగురు మృతి

మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ముంబయిలో లోకల్ రైలు కింద పడి ఐదుగురు మరణించారు

Update: 2025-06-09 05:18 GMT

మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ముంబయిలో లోకల్ రైలు కింద పడి ఐదుగురు మరణించారు. మహారాష్ట్రలోని ముంబ్రా రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తూ రైలు పట్టాలపై పడిపోయారు. ఆ సమయంలో వీరు ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్ వేగంగా ఉండటంతో వారు పట్టుతప్పి పడిపోయి గాయాలపాలయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

ముంబై నుంచి వస్తుండగా...
స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఈరోజు ఉదయం ముబ్రా నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కు వేగంగా వెళుతున్న ముంబై సబర్బన్ రైలు నుంచి పది నుంచి పన్నెండు మంది ప్రయాణికులు పడిపోయారు. వేగంగా వెళుతుండగా ఈ ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని తెలిసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News