Murder Case : సహజీవనం.. అసహనం.. మర్డర్.. ఇదీ పోలీస్ అధికారిణి మర్డర్ స్టోరీ

గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఒక మహిళ ఎస్.ఐని ఆమె ప్రియుడు కానిస్టేబుల్ హత్య చేశాడు

Update: 2025-07-20 06:37 GMT

ప్రేమ లేదు.. దోమ లేదు.. అంతా ట్రాష్. అవసరం తీరిపోయిన తర్వాత హత్యలకు దారి తీస్తున్నాయి. అనేక చోట్ల హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ప్రేమతో దగ్గరయిన తర్వాత ఒకరికొకరు సహజీవనం చేస్తూ చివరకు విసుగు పుట్టిన తర్వాత హత్య చేయడం పరిపాటిగా మారింది. ఇందుకు పోలీసులు కూడా అతీతులు కారు. పోలీసులు అని హత్యలకు వెనకాడే పరిస్థితులు ఇప్పుడు లేవు. క్షణికావేశంలోనో, ప్లాన్ ప్రకారమో మర్డర్ లు జరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఒక మహిళ ఎస్.ఐని ఆమె ప్రియుడు కానిస్టేబుల్ హత్య చేసిన ఘటన గుజరాత్ లో జరిగింది.

గుజరాత్ లోని కచ్ జిల్లాలో...
గుజరాత్ లోని కచ్ జిల్లాలో జరిగిన ఈఘటన కలకలం రేపింది. తనతో సహజీవనం చేస్తున్నమహిళ ఏఎస్ఐను సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏఎస్ఐగా పనిచేస్తున్న మహిళ అధికారిణితో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దిలీప్ డాంగ్బియా ప్రేమలోపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు సహజీవనం చేస్తున్నారు మహిళ ఏఎస్ఐ సతుభాయ్ జాదవ్, దిలీప్ డాంగ్బియా ప్రేమాయణం కొద్దికాలం బాగానే సాగింది. అయితే ఒకరు ఏఎస్ఐ, మరొకరు కానిస్టేబుల్ కావడంతో ఇగోలు తట్టిలేపినట్లున్నాయి.
నాలుగేళ్ల నుంచి...
ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో కచ్ లోని అంజార్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నఅరుణాబెన్ సతుభాయ్ జాదవ్ తో ఆమె ప్రియుడు దిలీప్ డాంగ్బియాకు మధ్య గొడవలు జరిగాయి. చినికి చినికి పెద్దదిగా మారింది. అయితే అరుణాబెన్ సతుభాయ్ జాదవ్ దిలీప్ డాంగ్బియా తల్లి గురించి చెడుగా మాట్లాడిందని కోపంతో అరుణాబెన్ సతుభాయ్ జాదవ్ ను దిలీప్ డాంగ్బియా హత్య చేశాడు. దీంతో మహిళ ఎస్ఐని కోపంతో దిలీప్ డాగ్బియా గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసిన అనంతరం అతను అంజార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ప్రేమగా మారింది. 2021 నుంచి వీరు కలసి జీవిస్తున్నారు. చివరకు హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





Tags:    

Similar News