లోయలో పడ్డ లారీ - పది మంది మృత్తి

కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు

Update: 2025-01-22 05:35 GMT

కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. కూరగాయలు, పండ్లతో వెళుతున్న లారీ అదుపు తప్పి మరో వాహానాన్ని ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న పది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇరవై మంది వరకూ గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

అదుపు తప్పి ట్రక్కును ఢీకొని...
గులాపురా గ్రామ సమీపంలోని యాలాపురా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ సావనూర్ నుంచి కుంత మార్కెట్ కు కూరగాయలు విక్రయించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాహనం అదుపు తప్పి లోయలో పడటంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News