ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

Update: 2025-08-15 03:19 GMT

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రయివేటు బస్సులు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో ఇరవై ఆరు మంది గాయపడ్డారు. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న జగన్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి వచ్చిన శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

రెండు ప్రయివేటు బస్సులు ఢీకొట్టడంతో...
అయితే శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు, జగన్ ట్రావెల్స్ బస్సులో ఒకరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కడప— నంద్యాల ప్రధాన రహదారిలోని ఆళ్లగడ్డ ఆల్ఫా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఘటన జరిగింది. తిరుపతి నుండి హైదరాబాదుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని 26 మందిని ఆళ్లగడ్డ,నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News