పెళ్లి మండపం నుండి నిందితుణ్ని వెంటాడిన డ్రోన్‌

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో పెళ్లికుమారుడిపై ఓ వ్యక్తి కత్తితో మూడు సార్లు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

Update: 2025-11-13 13:58 GMT

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో పెళ్లికుమారుడిపై ఓ వ్యక్తి కత్తితో మూడు సార్లు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. బైక్‌తో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పెళ్లి వీడియోగ్రాఫర్‌ తన డ్రోన్ కెమెరాతో నిందితుణ్ని దాదాపు రెండు కిలోమీటర్లు వెంబడించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రోన్‌ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుణ్ని, అతను దాక్కున్న ప్రాంతాన్ని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో, ఈ దాడికి కారణం డీజే డాన్స్ సమయంలో జరిగిన చిన్న గొడవ అని తేలింది. ఆ గొడవతో ఆగ్రహించిన నిందితుడు పెళ్లికుమారుడిపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన పెళ్లి కొడుకు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

Tags:    

Similar News