Bengaluru : చిన్న ఆరోగ్య సమస్యలకే భార్యను కడతేర్చాడుగా
బెంగళూరుకు చెందిన వైద్యుడు మహీంద్రారెడ్డి తన భార్య కృతికారెడ్డిని హత్య చేశాడు
చిన్నపాటి ఆరోగ్యసమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే తనకు తెలియకుండా ఈ సమస్యలను దాచిపెట్టి వివాహం జరిపించారని ఒక వైద్యుడు తన భార్యను హత్య చేసిన ఘటన బెంగలూరులో జరిగింది. భార్యా భర్తలిద్దరూ వైద్యులే. అయితే పెళ్లికి ముందు తనకు ఉన్న అనారోగ్య సమస్యలను ఎందుకు చెప్పలేదని ఆ వైద్యుడు కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాను వైద్యుడే కావడంతో అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలించుకునేందుకు సిద్ధపడ్డాడు. మహేంద్రారెడ్డి, కృతికారెడ్డి ఇద్దరూ వైద్యులే. డాక్టర్ కృతికా రెడ్డి డెర్మటాలజిస్ట్ కాగా, మహేంధ్రరెడ్డి జనరల్ సర్జన్. ఇద్దరికీ గత ఏడాది మే 26వ తేదీన వివాహం జరిగింది.
ఇద్దరూ వైద్యులే...
కృతికారెడ్డి విక్టోరియా ఆసుపత్రిలో డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. అయితే కృతికా రెడ్డికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలున్నాయి. అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు లో షుగర్ కూడా ఉంది. అయితే వివాహానికి ముందు ఈ విషయాన్ని కృతికారెడ్డి కుటుంబీకులు దాచిపెట్టి మంచి సంబంధమని భావించి మహేంద్రరెడ్డితో వివాహం చేశారు. అయితే వివాహం అయిన తర్వాత కొన్ని రోజులకు కృతికారెడ్డికి ఈ ఆరోగ్య సమస్యలున్నాయని గుర్తించిన మహేంద్రారెడ్డి ఆగ్రహించారు. కృతికారెడ్డితో కలసి అత్తగారింటికి వచ్చారు. ఆరోగ్య సమస్యలకు ట్రీట్ మెంట్ ఇచ్చే నెపంతో మత్తుమందు ఇస్తూ వచ్చాడు. అయితే అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడంతో కృతికారెడ్డి స్పృహ తప్పి పడిపోయింది.
అధిక మోతాదులో మత్తుమందిచ్చి...
వెంటనే తెలివిగా తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి మహేంద్రరెడ్డి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే కృతికారెడ్డి మరణించిందని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టంలో కృతికారెడ్డి శరీరంలో మత్తుమందు ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నట్లు బయటపడటంతో ఇది హత్యగా బయటపడిింది. దీంతో బెంగలూరులోని మారతహళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మహేంద్రరెడ్డిని నిన్న అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వైద్యుడు మహేంద్రరెడ్డి తానే మత్తు మందు అధిక మోతాదులో ఇచ్చి హత్య చేసినట్లు మారతహళ్లి పోలీసులు తెలిపారు. మహేంద్ర రెడ్డిని కఠినకంగా శిక్షించాలని కృతికారెడ్డి కుటుంబీకులు కోరుతున్నారు.