వాహనాలను దొంగిలించి.. నకిలీ పత్రాలు తయారు చేసి అమ్మేయడమే.. ఎట్టకేలకు అరెస్ట్

అతను వాహనాలను దొంగిలించి, నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (RC లు) సృష్టించి

Update: 2022-08-11 11:20 GMT

ఢిల్లీ పోలీసులు మనోజ్ సింగ్ అనే హైటెక్ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతడు బైక్ ల దొంగతనాలను చేసి ఎంతో తెలివిగా ఆన్ లైన్ లో అమ్ముతూ ఉండేవాడు. అతను వాహనాలను దొంగిలించి, నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (RC లు) సృష్టించి OLX వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించేవాడు. వాహనాల అసలు యజమాని ఎవరో తెలియజేయకుండా ఇలా వాహనాలను అమ్ముతూ ఉండేవాడు.

జూలై 21న ఢిల్లీలోని ఎస్‌జీఎం హాస్పిటల్‌లో హీరో ప్యాషన్ ప్రో దొంగిలించబడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌ను దొంగిలించినట్లు తేలింది. ఆగస్టు 4వ తేదీన అధికారులకు దీనిపై సమాచారం అందడంతో నిందితుడు మనోజ్‌ని అరెస్టు చేశారు.
విచారణలో తాను నిరుపేద కుటుంబానికి చెందినవాడినని, హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ చేశానని వెల్లడించాడు. గతంలో కూడా ఫోర్జరీ కేసుల్లో అరెస్టయ్యాడని తేలింది. బైక్‌లను దొంగిలించడం, విక్రయించడంలో తనది ప్రత్యేకమైన శైలి అని వెల్లడించాడు. అతను వివిధ ప్రాంతాల నుండి ద్విచక్రవాహనాలను దొంగిలించేవాడు. అసలు యజమానుల నకిలీ ఐడిలను తయారు చేశాడు. నకిలీ ఆర్సీలు కూడా తయారు చేశాడు. వాహనం యొక్క నిజమైన యజమానిగా నటిస్తూ వివిధ వినియోగదారులకు OLX వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మోటార్‌సైకిళ్లను విక్రయించేవాడు.


Tags:    

Similar News