ఢిల్లీ ప్రమాదం జరిగింది అందుకేనా? ఎనిమిది మంది మరణం వెనక?
ఢిల్లీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిది మందికి చేరింది. ఢిల్లీలోని జైత్ పూర్ లోని హరినగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిది మందికి చేరింది. ఢిల్లీలోని జైత్ పూర్ లోని హరినగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంటి గోడ కూలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీలో భారీగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలికలు, నలుగురు పురుషులు ఉన్నారని ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే గోడకూలిన ఘటన సమాచారం తెలుసుకున్న అగ్నిమాక కేంద్రం సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలికి వచ్చి వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి.
మృతులు వీరే...
మృతులను షబీబుల్, రబీబుల్, ఆలీ, రుబీనా, డాలీ, రుఖ్సానా, హసీనాలుగా గుర్తించారు. అయితే భారీ వర్షాలకు గోడ నాని కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే పురాతన భవనాలు, మట్టి భవనాలు, కూలడానికి సిద్ధంగా ఉండే చోట ఎవరూ ఉండకూడదని ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు కూడా భారీ వర్షం కురుస్తుందని, వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో ఈ సూచనలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.