రాజస్థాన్‌లో అండర్ కవర్ ఆపరేషన్... పది కోట్లు స్వాధీనం

రాజస్థాన్ లో సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పది కోట్లు స్వాధీనం చేసుకున్నారు

Update: 2022-08-29 05:47 GMT

రాజస్థాన్ లో సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని అనేక మంది నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. నిందితుల నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వారంతా రాజస్థాన్ లో వ్యాపారవేత్తలుగా చలామణి అవుతున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

ట్రేడింగ్ యాప్ ను...
ట్రేడింగ్ యాప్ ను క్రియేట్ చేసి కోట్లాది రూపాయల మొత్తాన్ని ప్రజల నుంచి కొల్లగొట్టారు. ఈ యాప్ లో మూడు వేల మంది పైగానే జంటనగరవాసులు చేరారు. పది కోట్ల రూపాయల వరకూ స్వాధీనం చేసుకున్నారు. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ పేరుతో ఈ మోసానికి పాల్పడ్డారు. మూడు నెలల పాటు రాజస్థాన్ లో అండర్ కవర్ ఆపరేషన్ చేసి సైబరాబాద్ పోలీసులు నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News