Delhi Blast : కారుకు. పుల్వామాకు లింకు
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లలో ఉపయోగించిన కారు సీసీ టీవీ ఫుటేజీలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లలో ఉపయోగించిన కారు సీసీ టీవీ ఫుటేజీలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పుల్వామాకు చెందిన తారిఖ్ కొనుగోలు చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ఈ పేలుడుకు ప్రధాన కారణమైన ఐ 20 కారు ను సీసీ టీవీ కెమెరాల్లో పోలీసులు కనుగొన్నారు. నిన్న సాయంత్రం 6.52 గంటలకు ఈ కారు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోకి వచ్చి నిదానంగా వెళుతూ పేలుడుకు కారణమయింది.
కారు నడుపుతున్న వ్యక్తికి...
అయితే ప్రమాదం సమయంలో కారు నడుపుతున్న వ్యక్తిని మహ్మద్ ఉమర్ గా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఉమర్ ఒక వైద్యుడని కూడా గుర్తించారు. ఉమర్ కు ఫరీదాబాద్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కారును పుల్వామాకు చెందిన తారిఖ్ చివరిసారిగా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు నుంచి ముగ్గురు ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.