శంకర్ రెడ్డి నిజాలు చెబుతారా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసింది

Update: 2021-11-26 07:50 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా దేవిరెడ్డి శంకర్ రెడ్డిని విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకుంది. ఆరు రోజుల పాటు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. హత్యకు గల కారణాలు, నలభై కోట్లు సుపారీ ఇచ్చింది ఎవరు? అన్న కోణంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.

హత్య వెనక?
2019 మార్చి 15వ తేదీన వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఆస్తి, భూవివాదాలే కారణమని దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడయింది. బెంగళూరులో ఒక స్థల వివాదంలోనే ఈ హత్య జరిగినట్లు దస్తగిరి చెప్పారు. హత్య చేసింది ఎవరో చెప్పారు. అయితే హత్య వెనక కీలక వ్యక్తుల ఎవరైనా ఉన్నారన్న దానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. శంకర్ రెడ్డి విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News