విరాట్ కోహ్లీ బెంగళూరు పబ్‌పై కేసు

ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి చెందిన బెంగళూరులోని పబ్, రెస్టారెంట్‌ ‘ఒన్‌ 8 కమ్యూన్‌’ మీద సోదాలు జరిగాయి.

Update: 2025-06-03 11:30 GMT

ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి చెందిన బెంగళూరులోని పబ్, రెస్టారెంట్‌ ‘ఒన్‌ 8 కమ్యూన్‌’ మీద సోదాలు జరిగాయి.అందులో స్మోకింగ్‌ జోన్‌ లేని విషయాన్ని గుర్తించారు. దీంతో కేసు నమోదు చేశారు. స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఈ రెస్టారెంట్, పబ్‌కు సహయజమానిగా ఉన్న కోహ్లీకి, సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.


హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో తప్ప నిసరిగా స్మోకింగ్‌జోన్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ‘ఒన్‌ 8 కమ్యూన్‌’ గతంలోనూ వార్తల్లో నిలిచింది. 2024 జూలై 6న అర్ధరాత్రి దాటాక 1.20 గంటల వరకు పబ్‌ను తెరిచే ఉంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News